పల్నాడు: పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నదని వెల్లడించారు. మృతులు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్దమీదపల్లికి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.