కడప: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. బాధితులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానికులు దవాఖానకు తరలించారు.