ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లా కొమరోలు మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్లతో (Gas cylinder) వెళ్తున్న ఓ లారీ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో అందులో ఉన్న 306 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ లారీలోనుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పించి. భారీ శబ్ధంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సిలిండర్ల లారీ కర్నూలు నుంచి ఉలువపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, లారీకి విద్యుత్ వైర్లు తగలడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.