అమరావతి : తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident ) జరిగింది. ఘటనలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం కలకడ నుంచి చెన్నైకి టమాట (Tomoto Lorry) లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కారును, మరో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టార. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.