అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident ) జరిగింది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. విశాఖ (Visaka) జిల్లా కంచిలి మండలం జక్కర వద్ద జాతీయ రహదారిపై మంగళవారం అతివేగంగా వచ్చిన కారు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ( Electric Pole) ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా విశాఖకు చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.