Kurnool Bus Accident | కర్నూలు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమ పలు వివరాలు వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను ఒక వీడియో రూపంలో వివరించారు. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చూశానని తెలిపారు.
‘ పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా కర్నూలు దగ్గర యాక్సిడెంట్ జరిగి భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. అప్పుడు బస్సులో మంటలు రావడం కనిపించింది. ఏదైనా సాయం చేద్దామని వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది ఏడుస్తున్నారు.. ఆ బస్సుకు సంబంధించిన వాళ్లు అందులో ఉన్నారని బాధపడుతూ ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ల మొబైల్స్, బ్యాగులు అన్ని బస్సులోనే తగలబడిపోతూఉన్నాయి. ఇదిలా ఉంటే అక్కడ ఉన్న జనాలు మాత్రం చూస్తూ ఉండిపోయారు. ఎవరూ పోలీసులకు ఫోన్ సమాచారం అందించలేదు. నేనే వెంటనే కర్నూలు ఎస్పీ, ఇన్స్పెక్టర్ నంబర్లు నా దగ్గర ఉంటే వారికి కాల్ చేశా. వెంటనే వాళ్లు రెస్పాండ్ అయ్యారు. ఆ వెంటనే రూరల్ కాసేపటికే రూరల్ సీఐ బృందం, ఫైరింజన్లు వచ్చాయి. అప్పటికే ధర్మవరం చెందిన హరీశ్ అనే వ్యక్తి ప్రైవేటు వెహికిల్‌లో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత మరో ఐదుగురిని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.’ అని హైమ ఆ వీడియోలో తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే ఎస్పీ, ఇతర పోలీస్ సిబ్బంది వచ్చారని తెలిపారు. అప్పుడు వెళ్లి బస్సులో చూడగా మొత్తం మాంసపు ముద్దలు, సీట్లలో అస్తి పంజరాలు కనిపించాయని తెలిపారు. వాటిని చూసి తట్టుకోలేకపోయానని ఆవేదన చెందారు.
She was a witness to the Kurnool bus accident, and after hearing her speak, my heart sank. I realized how inhumane people have become — instead of helping or calling the police, many stood there recording videos.
pic.twitter.com/3GZO1RDu6w— sunanda🇮🇳 (@Boppana_Sunanda) October 24, 2025
ఇక మరో ప్రత్యక్ష సాక్షి కూడా వివరాలను పంచుకున్నారు. ‘ హిందూపురం నుంచి నంద్యాల వెళ్తున్నప్పుడు మంటల్లో కాలిపోతున్న బస్సును చూశా. ప్రమాదం ఎలా జరిగిందో నాకు క్లారిటీ లేదు. నేను చూసేసరికి మంటలు ఎగిసిపడుతున్నాయి. బస్సు దగ్గరకు పోయేందుకు కూడా వీలు లేనంతగా చుట్టూ మంటలు వ్యాపించాయి. బయట నుంచి ఎవరూ కాపాడే పరిస్థితి కూడా లేకుండా లేదు. అప్పుడే బస్సులో నుంచి రమేశ్ అనే వ్యక్తి అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత మరికొంతమంది బయటకు వచ్చారు. అలా వచ్చిన వాళ్లలో ఆరుగురిని రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లా’ అని తెలిపారు.