అమరావతి : ఏపీలో ఉద్యోగుల బదిలీల (Employees transfers ) గడువును ఈనెల 15 నుంచి మరో వారం రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 22 వరకు గడువును (Extension) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 23 నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఎక్సైజ్(Excise) శాఖ బదిలీల గడువును సెప్టెంబరు 30 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎక్సైజ్‌లో ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(SEB) ను నిన్న రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను, సిబ్బందిని ఎక్సైజ్‌శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఎక్సైజ్‌శాఖలో బదిలీల గడువుకు సమయం పడుతుండడంతో ఈనెల 30 వరకు ఆ శాఖ ఉద్యోగుల బదిలీ గడవును పొడిగించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీపై ప్రత్యేక దృష్టిని సారించింది.
ఏళ్ల తరబడిగా బదిలీలకు నోచుకోని ఉద్యోగులు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు ఈ నెల 1 వ తేదీ నుంచి 15వ తేదీవరకు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బదిలీలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రభుత్వం బదిలీల గడువును మరోవారం పాటు పొడిగించింది.
x