అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారి (Nationa Highway) పై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో రెండు లారీల డ్రైవర్లు ఉన్నారు. చనిపోయినవారిలో ఐదుగురు పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. దుర్ఘటన విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర (Minister Ravindra ) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సీఎం ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆరుగురికి రూ. 30 లక్షల అందజేస్తామని వెల్లడించారు.