Vijayasai Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించింది.
వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఏపీలో అమలు చేసిన మద్యం పాలసీతో భారీ అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కాంమ్కు సంబంధించి ఈడీ విస్తృతంగా దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలో ఈ కేసులో పలువురు వైసీపీ నాయకులు, అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇందులో విజయసాయి రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. మద్యం సరఫరాదారులు, డిస్టలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి, ఆ నగదును హవాలా రూపంలో బదిలీ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కింద విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.