ప్రకాశం: ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొత్తూరులోని రాజు దవాఖాన వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలో ప్రకంపణలు వచ్చాయి. దీంతోన మహిళలు ఇండ్లలోనుంచి పరుగులు తీశారు.
కాగా, సోమవారా సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. గంగాధర, చొప్పదండిలోని వాస గృహాలు, దుకాణ సముదాయాలు, సూపర్మార్కెట్లలో సామానులు కిందపడిపోగా, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో భూమి కంపించింది.