విజయవాడ : (Jagan wishes) దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
మూడో రోజు కొనసాగిన రైతుల మహా పాదయాత్ర
కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..