(Dhimsa Dance) రాంచీ: ఒకప్పుడు అరకు లోయకే పరిమితమైన థింసా నృత్యం.. ఇప్పడిప్పుడే జాతీయస్థాయి గుర్తింపు పొందుతున్నది. రాంచీలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరిగిన 13వ ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో థింసా నృత్యాన్ని ప్రదర్శించి అందరి మనసులను దోచుకున్నారు విశాఖపట్నంకు చెందిన గిరిజనులు. ఈ ట్రైబల్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గిరిజన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమతమ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కార్యక్రమాలను ప్రదర్శించారు.
అరకులోయలో ఎంతో ప్రజాదరణ పొందిన గిరిజన నృత్య రూపమైన థింసాను శుభ సందర్భాలు, వివాహ వేడుకల సమయాల్లో ప్రదర్శించడం ఆనవాయితీ. కాగా, ఇళ్లు, గూడెం వదిలి బయటి ప్రాంతంలో థింసా ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. సుదూర ప్రాంతాలకు వెళ్లడం మా ఆచారం కాదు. అయితే సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం కోసం కాబట్టి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నామని ముంచింగిపుట్టు మండలం దారెలకు చెందిన ఆదికతీయ అనే యువతి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త సంస్కృతులు, కొత్త వంటకాలు, కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తులతో పరిచయం పొందడం మాకు ఒక అందమైన అనుభవం అని గుర్తుచేసుకున్నారు.
ఈ గిరిజన యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 200 మంది గిరిజనులు పాల్గొన్నారు. వారిలో 50 మంది విశాఖపట్నానికి చెందినవారు ఉండటం విశేషం. జాతీయ యువజనోత్సవంలో సాంస్కృతిక విభాగంలో థింసా ప్రదర్శన మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు వైజాగ్ జట్టు దేశ నిర్మాణం, దేశభక్తిని చాటిచెప్పే డిక్లమేషన్ కాంటెస్ట్‌లో మూడవ స్థానాన్ని గెలుచుకున్నదని జిల్లా యువజన అధికారి గొర్లే మహేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..