అమరావతి : ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ( Disaster Management ) రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి విపత్తుల సంస్థ తుపానుకు దిట్వాగా ( Ditva ) నామకరణం చేసింది.
ఈ తుపాను శ్రీలంకలోని టింకోమలీకి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకు ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తమిళనాడు , పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు ఆదివారం చేరే అవకాశముందని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఆదివారం కడప, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని సూచించారు.