తిరమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే స్వామిదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,917 మంది భక్తులు దర్శించుకోగా 25,161 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4. 82 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందన్నారు.
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎస్.సత్య నారాయణ ప్రమాణం
రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్ ఎస్.సత్యనారాయణ (Satyanarayana) టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.