తిరుమల : కష్ట నివారణ గోవిందా.. ఆపధ్బాందవ గోవిందా అంటూ భక్తులు తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 నుంచి 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శుక్రవారం 78,733 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,146 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.41 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.