నెల్లూరు : (CPI Narayana) కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. పెట్రో ధరల విషయంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటకాలాడుతున్నదని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన రూ.40 ను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలన్నారు. దసరా ఆఫర్ మాదిరిగా రూ.10 తగ్గించడమేంటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా ఉంటున్నాయని సీపీఐ నారాయణ దుయ్యబట్టారు. అదానీ పోర్టు నుంచే ప్రధానంగా డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఆరోపించారు. కేంద్రానికి వైసీపీ మద్దతుగా ఉండటంతోనే డ్రగ్స్ రవాణాకు విజయవాడను ఉపకేంద్రంగా ఎంచుకున్నారన్నారు. ఆంధ్రా నుంచే డ్రగ్స్ వస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పిన విషయాన్ని నారాయణ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే అమిత్ షా కు నల్లజెండాలతో నిరసన తెలపాలని కోరారు. అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవద్దని, ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూడటం సరికాదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తే రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తామని నారాయణ హెచ్చరించారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..