(Corona Cases in AP) విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం 348 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,69,352 కి చేరుకున్నాయి.
ఏపీ రాష్ట్రంలో గత నెల రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో గత ఇరవై నాలుగు గంటల్లో మూడు కొత్త మరణాలు సంభవించగా.. మరణాల సంఖ్య 14,409కి చేరింది. యాక్టీవ్ కేసుల సంఖ్య 3,220 ఉన్నాయి. మరోవైపు, గత 24 గంటల్లో 358 మంది కొత్త రోగులు నయమయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 20,51,747 కి చేరుకున్నది. తూర్పు గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో యాక్టీవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వానలు పడుతున్నా టీకాలు ఇవ్వడం కొనసాగిస్తున్నారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..