అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ (Srisailam Reservoir ) కు వరద ఉద్ధృతి కొనసాగుతుంది . కృష్ణా నదికి ఎగువ భాగంలో అధిక వర్షాలు కురుస్తుండడంతో సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలంకు భారీగా వరద ప్రవాహం వస్తుంది. లక్షా 05, 721 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వస్తుండగా 1,03,026 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 269.748 మీటర్లకు గాను ప్రస్తుతం 269.26 మీటర్లకు నీరు నిల్వ ఉంది. నిలువ సామర్ధ్యం 215.81 టీఎంసీలకు గాను 210.03 టీఎంసీల వరకు నీరు ఉందని అధికారులు వివరించారు.