తిరుమల : తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో నోట్ల లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు (Parakamani theft case) లో ఫిర్యాదుదారు సతీష్( Satish) అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ మృతదేహాం తాడిపత్రి రైల్వే ట్రాక్ ( Railway Track) పై పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు.
ప్రసుత్తం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్‌కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ . 2023 ఏప్రిల్‌లో హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా అప్పటి విజిలెన్స్ ఎస్సైగా ఉన్న సతీష్ పట్టుకుని ఫిర్యాదు చేశారు. అనంతరం అదే సంవత్సరం మే 30న రవికుమార్‌పై విజిలెన్స అధికారులు చార్జ్‌షీట్ ఫైల్ దాఖలు చేశారు.
కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదనతో అతని ఆస్తులపై వైసీపీ నాయకులు కన్నేసారని ఆరోపణలు ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో కేసును వైసీపీ నాయకులు రాజీ చేయించి రవికి చెందిన కొన్ని ఆస్తులు విరాళంగా తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్టు తీర్మానించి పరాకమణి కేసును పక్కకుపెట్టింది.
అనంతరం ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరకామణి వ్యవహారం మరోసారి వెలికితీశారు. 2024 సెప్టెంబర్ నుంచి రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. కేసును తీవ్రంగా పరిగణించిన కూటమి సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించడంతో అధికారులు ఇటీవల విచారణను వేగవంతం చేశారు. దీంట్లో భాగంగా మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతుంది .