CM Jagan | ఆంధ్రప్రదేశ్లో ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) పేరిట ప్రభుత్వం తలపెట్టిన క్రీడా పోటీలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లు అందజేశారు.
కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాకు సీఎం జగన్ క్రికెట్ పాఠాలు నేర్పించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీంతో రోజా సైతం తన అన్న (జగన్ను ఉద్దేశించి) చెప్పినట్టు బ్యాటింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
క్రికెట్ ఆడుతున్న సీఎం జగన్ 🔥💫
బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ #AadudamAndhra pic.twitter.com/8SIkcPBe7f
— Rahul (@2024YCP) December 26, 2023
ఆట ప్రారంభం 🔥
మా అధినేత సిద్ధం
మా నాయకులను సైతం సిద్ధం చేస్తున్నాడు
ఫ్యాన్స్ గా మేం ఎప్పుడూ సిద్ధం#AadudamAndhra#YSJaganAgain pic.twitter.com/0o4dmmpj3j— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) December 26, 2023
Also Read..
Chaithra J. Achar | రెడ్ మిర్చీలా ఘాటెక్కిస్తున్న చైత్ర జె. ఆచార్..
Sabarimala: 200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం
Chirag Sen | ఫేవరేట్లకు షాకిస్తూ.. నేషనల్ చాంపియన్షిప్ ట్రోఫీని ముద్దాడిన చిరాగ్