Sabarimala: 200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం
Sabarimala Ayyappa Revenue: శబరిమల ఆదాయం 200 కోట్లు దాటింది. గత 39 రోజుల్లో ఆ అమౌంట్ వచ్చినట్లు టీడీబీ తెలిపింది. కానుకల రూపంలో 63.89 కోట్లు రాగా, అరవన ప్రసాదం ద్వారా 96.32 కోట్లు వచ్చింది. మండల పూజ కాలంలో 31 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు.
శబరిమల: కేరళలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయం రూ.200 కోట్లు దాటింది. రెండు నెలల మండల పూజ దీక్షాకాలం డిసెంబర్ 27వ తేదీన ముగియనున్నది. అయ్యప్ప దేవస్థానంకు గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఇవాళ తెలిపింది. టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఇంకా లెక్కిస్తున్నామని, పూర్తి ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు భక్తుల సమర్పించిన కానుకల ఆదాయం 63.89 కోట్లు కాగా, అరవన ప్రసాదం అమ్మకాల ద్వారా 96.32 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా 12.38 కోట్లు వచ్చినట్లు ప్రశాంత్ తెలిపారు.
మండల పూజ సమయంలో డిసెంబర్ 25వ తేదీ నాటికి సుమారు 31,43,163 భక్తులు ఆలయాన్ని సందర్శించారు. 7,25,049 మందికి ఉచిత భోజనం పెట్టారు. బుధవారం రాత్రి 11 ఆలయాన్ని మూసివేయనున్నారు. మకరవిలక్కు పండుగ కోసం మళ్లీ డిసెంబర్ 30వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మరో వైపు శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో సోమవారం కూడా భక్తులు ఆలయాన్ని విజిట్ చేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
14 hours of torture for Ayyappa devotees!
Stranded without food, water, or even basic sanitation. Sabarimala has turned into a nightmare.
And this is not just mismanagement by the administration, it’s deliberate harassment of devotees by Anti-Sanatani Communist govt! pic.twitter.com/JUSNdN3lbm
— Anoop Antony (@AnoopKaippalli) December 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

