Chirag Sen : అన్‌సీడెడ్ చిరాగ్ సేన్(Chirag Sen) సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్(Senior National Championship)లో సంచలనం సృష్టించాడు. టోర్నీ ఆరంభం నుంచి ఫేవరేట్లకు షాకిస్తూ వచ్చిన ఈ యువకెరటం టైటిల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో తరుణ్(Tarun)ను 21-14, 13-21, 21-19తో ఓడించిన చిరాగ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్ కర్బ్ చాంపియన్‌గా అవతరించింది. ధ్రువ్ కపిల, తనీష క్రాస్టో ద్వయం మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
అన్‌సీడెడ్‌గా టోర్నీలో అడుగుపెట్టిన చిరాగ్ సంచలన ఆటతో ఫైనల్‌కు చేరాడు. టైటిల్ పోరులో అతడు మొదిటి సెట్ అవలీలగా గెలిచి.. రెండో సెట్లో వెనకబడ్డాడు. అయితే.. కీలకమైన మూడో సెట్లో పుంజుకొని రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు చిరాగ్ తమ్ముడు కావడం విశేషం.
ట్రోఫీలతో విజేతలు
నేను మ్యాచ్‌లో కొంచెం వెనకబడ్డాను. కానీ చివరకు టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గత మూడు నాలుగు నెలల నుంచి బాగా ఆడుతున్నా. అంతర్జాతీయ టోర్నీల్లో రాణించాలనేది నా ముందున్న లక్ష్యం. షట్లర్‌గా నేను ఎదిగేందుకు లక్ష్యసేన్ ఎంతో సహకరించాడు. అని చిరాగ్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న లక్ష్యసేన్ ఒక్కసారి కూడా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ విజేతగా నిలవలేకపోయాడు. రెండుసార్లు (2019, 2017)ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. కానీ, చిరాగ్ అన్నకు సాధ్యం కానిదాన్ని చిరాగ్ సాధించి చూపించాడు. ఈ యంగ్‌స్టర్ 2020లో కెన్యా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచాడు.