భువనేశ్వర్ : (Jagan met Patnaik) ఒడిశా రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పలు కీలక విషయాలపై చర్చించారు. ప్రధానంగా మూడు అంశాలను ఒడిశా సీఎం దృష్టికి జగన్ తీసుకువెళ్లినట్లు సమాచారం. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ జరిపారు. ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నవీన్ పట్నాయక్, జగన్ వెల్లడించారు.
ప్రత్యేక విమానంతో భువనేశ్వర్ చేరుకున్న జగన్‌కు సీఎం నవీన్ పట్నాయక్ ఘనంగా స్వాగతం పలికారు. సచివాలయంలో ఇరువురు భేటీ అయి వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించనున్నట్లు సమాచారం. వీరిద్దరి భేటీతో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర రైతుల కల సాకారం అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. భువనేశ్వర్ పర్యటనలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..