Collector Facebook Hack | చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కలెక్టర్ ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆయన ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నవారికి డబ్బులు కావాలని సందేశాలు పంపించారు. ఈ విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో కలెక్టర్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అకౌంట్ లాగిన్ కోసం ఓటీపీ లేదా రెండు అంచెల భద్రత (Two-Factor Authentication)ను యాక్టివేట్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. మెసేజ్‌లు, ఈమెయిల్స్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు దీనివల్ల మీ లాగిన్ వివరాలు హ్యాకర్లకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఫేస్బుక్లో లాగిన్ అలర్ట్స్‌ను ఆన్ చేసుకోవాలి. అప్పుడు మీ అకౌంట్ లాగిన్ అయిన ప్రతిసారి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల అనుమానాస్పద యాక్టివిటీని వెంటనే గుర్తించి అప్రమత్తం కావచ్చు. అలాగే పబ్లిక్ నెట్‌వర్క్‌ల్లో సోషల్‌మీడియా అకౌంట్లో లాగిన్ అవ్వకుండా, సురక్షిత ఇంటర్నెట్ను వినియోగించాలి.
పాస్‌వర్డ్‌ల విషయంలోనూ జాగ్రత్త పాటించాలి. తరచూ పాస్‌వర్డ్‌లను మార్చడం అలవాటు చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్లు (బర్త్ డే , మ్యారేజి డే, మొబైల్ నంబర్లు)ను సెట్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వరుస సంఖ్యలను కూడా పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకోవద్దని చెబుతున్నారు.
ఒకవేళ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురైందని అనిపిస్తే.. వెంటనే సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీలోకి వెళ్లి where you’re logged in లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అనుమానాస్పద డివైజ్‌లను గుర్తిస్తే వెంటనే లాగౌట్ చేయాలి. అలాగే facebook.com/hacked లింక్ ద్వారా రిపోర్ట్ చేయాలి.
Follow Us : on Facebook, Twitter
Free Current | గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Government Job | ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
Hyderabad Drugs Party | హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ.. రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ అరెస్టు
Ambati Rambabu | అంబటి రాంబాబుకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. మంత్రి నిమ్మల సెటైర్లు