(Healthcare Cheating) విజయవాడ: కొన్నిరోజుల క్రితం వెలుగు చూసిన వైద్య పరికరాల అద్దె కేసులో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయి. నిందితులు లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో ప్రజల వద్దనుంచి పెద్ద ఎత్తున డబ్బులు కాజేశారు. ఈ విషయాలను ఏపీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఇది ప్రీ ప్లాన్డ్గా చేసిన మోసమని ఆయన చెప్పారు. అధికవడ్డీ ఆశ చూపితే.. వెనుకాముందు ఆలోచించకుండా ఇలాంటి వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తలైవా డాట్ కాం అనే వెబ్ సైట్ ద్వారా లవ్ లైఫ్ అప్లికేషన్ను నిందితులు క్రియేట్ చేశారు. మెడికల్ పరికరాలను ఆన్లైన్ వేదికగా అద్దెకు తిప్పుతూ.. కొనుగోలు చేసిన వ్యక్తులకు షేర్ ఇస్తున్నట్టు నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన చాలా మంది పెద్ద మొత్తంలో పెట్టుబడిగా పెట్టారు. మొదట్లో నమ్మకంగా రిటర్న్స్ ఇవ్వడంతో.. ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇలా ఒక్కొక్కరూ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టారు. దాదాపు రూ.23 లక్షల వరకు పెట్టుబడులు వచ్చినట్లు తెలిసింది.
క్రిస్మస్ పండగ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఇచ్చారు. దాంతో చాలా మంది ఎగబడీ మరీ ఈ మోసగాళ్ల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేశారు. ఆదివారం వరకు సజావుగా పనిచేసిన అప్లికేషన్.. మరుసటి రోజున నిలిచిపోయింది. దాంతో మోసపోయామని గ్రహించిన పలువురు బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మోసపోయిన వాళ్లలో అధికాశాతం చదువుకున్న వారే ఉన్నట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిర్వాహాకులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. గుజరాత్ కేంద్రంగా ఈ భారీ మోసం జరిగినట్టు గుర్తించారు. మోసపోయిన బాధితులు 20 లక్షల మంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..