అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం చేయడంలోనూ, అమరావతి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సరం చేస్తుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని అభ్యర్థించడం కంటే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ( Withdraw ) చంద్రబాబుకు ట్విటర్ ( Twitter ) లో డిమాండ్ చేశారు.
పేదల ఉపాధిని నిర్వీర్యం చేసే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నూతన చట్టానికి మద్దతు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. సూచించారు. వీబీ-జీరాం-జీ చట్టంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు. ఈ చట్టం వల్ల కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధుల విడుదల అన్యాయమని అన్నారు.
అదేవిధంగా కేంద్రం నుంచి రావల్సిన ప్రాజెక్టులు , నిధులు ఏపీకి రావడం లేదని వివరించారు. ఇటువంటి సమయంలో నరేంద్ర మోదీకి మద్దతుగా ఎందుకు నిలబడాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి నష్టం జరుగక ముందే కేంద్రంతో పోరాడాలని ఆమె సూచించారు.