అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు (YS Jagan) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes ) తెలిపారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్లో ( Twitter ) పోస్టు చేశారు.
Warm birthday greetings to @ysjagan Garu. May he be blessed with good health and long life.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2024
అదేవిధంగా ఏపీ గవర్నర్(AP Governor) అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుషు ఇవ్వాలని, ప్రజాసేవలో సుదీర్ఘకాలం ఉండాలని ఆకాంక్షించారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.