అమరావతి : విజయవాడలో కారు సృష్టించిన బీభత్సంలో ఒకరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ బెంజ్‌సర్కిల్ మొదటి పైవంతెనపై వేగంగా దూసుకొచ్చిన కారు ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ నాగూర్ బీ(35) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.