అమరావతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana ) బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC) గా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ కొయ్యే మోషెన్రాజు తన చాంబర్లో బొత్సచేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ, శాసన మండలిలో ప్రజల కోసం నిలబడతామని , ప్రజా సమస్యలను మండలి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
పార్టీ అధిష్టానం మేరకు బాధ్యతయుతంగా ప్రజల తరుఫున మండలి(Council) లో చిత్తశుద్ధితో పోరాటం చేస్తానని వెల్లడించారు. రాబోయే కాలంలో విశాఖను,ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని వెల్లడించారు. ప్రస్తుతానికి వైసీపీ పార్టీది మూడు రాజధానుల విధానమేనని అన్నారు. అంతకు ముందు బొత్స వైఎస్ జగన్ను కలిసి ఎంతో నమ్మకంతో ఎమ్మెల్సీ పదవి అవకాశం ఇచ్చినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి అమర్నాథ్, వైసీపీ నాయకులున్నారు.
గత మూడు నెలల క్రితం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా బొత్స సత్యనారాయణతో పాటు మరొక స్వతంత్ర అభ్యర్థి రహీమ్ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Reactor Blast | అనకాపల్లి ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. 15 మంది కార్మికులకు గాయాలు