Reactor Blast | అనకాపల్లి ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ .. ఇద్దరు కార్మికులు దుర్మరణం
Reactor Blast | ఏపీలోని అనకాపల్లి(Anakapalli) జిల్లాలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి( Reactor Blast) 15 మందికి గాయాలయ్యాయి.
అమరావతి : ఏపీలోని అనకాపల్లి(Anakapalli) జిల్లాలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి( Reactor Blast) ఇద్దరు మృతి చెందగా మరో 18 మందికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఘటనతో పెను ప్రమాదం తప్పింది. అచ్యుతాపురం సెజ్(Sez) లోని ఎసెన్సియా కంపెనీలో అకస్మత్తుగా రియాక్టర్ పేలింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న 18 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
మరికొంత మంది మధాహ్నభోజన సమయంలో భోజనం చేసేందుకు బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం హుటాహుటిన బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. హారిక అనే కార్మికురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. మరో కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

