Bomb Threat | తిరుపతిలో బాంబు బెదిరింపు వార్త కలకలం సృష్టించింది. ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఐఈడీతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ అందడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తిరుపతి ఎస్పీకి సమాచారం అందించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు గుర్తించలేదు. దాంతో ఫేక్ బెదిరింపులుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే, కేరళ నుంచి ఈ మెయిల్ వచ్చినట్లుగా కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. గత రెండునెలల కిందట సైతం తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.