AP News | ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యమైంది. పల్లెటి రాజు (20) అనే మత్స్యకారుడు శనివారం మంగినపూడి బీచ్ లో వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యాడు. గమనించిన స్థానిక మత్స్యకారులు మెరైన్ పోలీసుల సహకారంతో రాజు కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజు మృతదేహం సత్రంపాలెం గ్రామ పరిసరాల్లో సముద్రంలో ఏడు కిలో మీటర్ల దూరంలో లభ్యమైంది. రాజు మృతితో తాళ్లపాలెం వైఎస్ఆర్ ఫిషర్ మెన్ కాలనీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఇవి కూడా చదవండి..
IND vs Srilanka | రెయిన్ ఎఫెక్ట్.. శ్రీలంక- ఇండియా తొలి టెస్ట్ రెండో రోజు ఆట ఆలస్యం
Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!
West Bengal | పశ్చిమ బెంగాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత, కుమారుడి దారుణ హత్య