అమరావతి : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఓ విద్యార్థిని సుసైడ్ చేసుకుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని(22) కాలేజీ బయటే ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నది. ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం హాస్టల్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను నారావారిపల్లి హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి సూసైడ్
తిరుపతి – మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ.. కాలేజీ బయటే ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న మంగళం ఏరియాకు చెందిన యువతి(22)
అయితే హాస్టల్లో ఉరివేసుకోవడంతో.. వెంటనే ఆమెను నారావారిపల్లి ఆసుపత్రికి… pic.twitter.com/BY1ItNJ5wt
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2026