తిరుపతి: రేపు రథసప్తమి పండుగను పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో వేడుకలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.