అమరావతి : ఆరోగ్యశ్రీ(Arogya Shree ) ద్వారా వైద్యమందించిన ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వైద్య సేవలు(Medical Services) నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
సుమారు రూ. 2,500 కోట్లు బకాయిలు చెల్లించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈవో(CEO) లక్ష్మీశ స్పందించారు. అనుబంధ ఆస్పత్రులకు రూ. 200 కోట్ల బకాయిలు విడుదల చేశామని, సోమవారం మరో రూ.300 కోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.