అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్-2 మెయిన్స్ (Group-2 Mains) పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 5న గ్రూప్-2 మెయిన్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్ష నిర్వహణ ఉంటుందని సంబంధిత అధికారులు(Department Officials) తెలిపారు.
లక్ష మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. డీఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (AP TET ) సంబంధించిన ఫైనల్ కీ (Final key) ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం నవంబర్ 2న ఫలితాలను ప్రకటించే అవకాశాలున్నాయి. నవంబర్ మొదటివారంలో మెగా డీఎస్సీ-2024 (Mega DSC) నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల( Teacher Posts) భర్తీకి సన్నహాలు చేస్తుంది.