అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏపీ స్పీకర్‌కు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్పీకర్ దంపతులను శాలువా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.