(Covid cases in AP) అమరావతి: ఆంధ్ర ప్రదేశ్లో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,942 కి పెరిగాయి. మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో రెండు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14, 499 కు చేరింది.
మరోవైపు, గత 24 గంటల్లో 95 మంది కొత్త రోగులు నయమయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం రికవరీల సంఖ్య 20,61,927 కు చేరుకున్నది. ప్రస్తుతం 1,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీ డాటా ప్రకారం, విశాఖపట్నం జిల్లాలో 80 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవగా.. చిత్తూరులో 55, కృష్ణాలో 50, ప్రకాశం జిల్లాలో గత ఇరవై నాలుగు గంటల్లో కేవలం 4 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 28,311 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 3,14,25,946 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కేసులు, 124 మరణాలు నమోదయ్యాయి.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..