Kakani Govardhan Reddy | ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దర్యాప్తు అధికారి దగ్గర పాస్పోర్టు సరెండర్ చేయాలని కాకాణికి హైకోర్టు షరతు విధించింది. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను దాటి వెళ్లడానికి వీళ్లేదని సూచించింది. అలాగే చార్జిషీటు దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టవద్దని కండీషన్ పెట్టింది. కాగా, అక్రమ మైనింగ్ కేసులో 85 రోజులుగా కాకాణి గోవర్దన్ రెడ్డి నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్నారు. మొత్తం ఎనిమిది కేసుల్లో ఆయనకు బెయిల్ రావడంతో రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.