Liquor Rates | సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10.. రిటైలర్ల మార్జిన్లో 1 శాతం పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఈ పెంపు ఐఎంఎఫ్ఎల్, ఫారిన్ లిక్కర్‌కు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. రూ.99 ధరలో లభించే కొన్ని బ్రాండ్లు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్స్‌పై మాత్రం ధరల పెంపు వర్తించదని స్పష్టంచేశారు. అలాగే బార్లపై విధిస్తున్న రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.