ఏపీ ఉద్యోగులు ద్వందవైఖరి అవలంభిస్తున్నారు : మంత్రి బొత్స

అమరావతి : జీతాల విషయంలో ఏపీ ఉద్యోగులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఒకపక్క కోరుతూనే పెరిగిన జీతాలు ఒకటో తేదీన వేస్తే అభ్యంతరాలు చేయడం ఏమిటని ఆయన ఆరోపించారు. సోమవారం సీఎంతో జరిగిన సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పీఆర్సీ, ఇతర సమస్యలపై చర్చించేందుకు నియమించిన సంప్రదింపుల కమిటీ మూడురోజుల పాటు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురుచూసినా ఎవరూ రాలేదని పేర్కొన్నారు. దీంతో తాము ఉద్యోగ సంఘాలు కోరితేనే సమావేశానికి వస్తామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సమస్యలుంటే సమావేశానికి వచ్చి వివరిస్తే పరిష్కరించేందుకు వీలుంటుందని అలా కాకుండా దూరంగా ఉంటూ ఆందోళనలు నిర్వహిస్తే ఎవరికీ మంచిది కాదని అన్నారు. రాష్ట్రం కోసం సమష్టిగా అందరూ బాధ్యత వహించాలని సూచించారు. ఉద్యోగులతో చర్చించేందుకు తమకు ఎలాంటి భేసాజు లేవని అయితే కోర్కేలు సమంజసంగా, చట్టబద్ధంగా ఉండాలని, ఆర్థిక పరిస్థితులను అర్ధం చేసుకోవాలన్నారు. బాధ్యత గల ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్‌పై, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి పర్యవసనం కూడా ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి అపోహాలు అవసరం లేదని బొత్స వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ఏపీ బకాయిలను, ఇతర పథకాల మంజూరు అంశాలను పార్లమెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం కోరుతుందని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

