(AP EAPCET) అమరావతి: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు మొదటి దశ అడ్మిషన్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అడ్మిషన్స్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) కింద ఈ ప్రవేశాలు జరుపుతున్నారు.
బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జనవరి 3న సీట్లు కేటాయిస్తారు. అదే నెల 6వ తేదీలోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, నీట్ కౌన్సెలింగ్ ఇంకా పూర్తి కానందున, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ), బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు.
ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు – డిసెంబర్ 23 నుంచి 25 వరకు
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్, ఆఫ్లైన్ – డిసెంబర్ 27 నుంచి 29 వరకు
ఎంపికల నమోదు – డిసెంబర్ 28 నుంచి 30 వరకు
సీట్ల కేటాయింపు – జనవరి 3న
కళాశాలల్లో రిపోర్టింగ్ – జనవరి 4 నుంచి 6 వరకు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..