అమరావతి : ఏపీలో పర్యాటక, ఆలయాల సందర్శనకు గాను నూతనంగా ప్రారంభించిన సీ ప్లేన్‌ను(Sea Plane) ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. శనివారం విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి సీప్లేన్‌ను ప్రారంభించి అందులో ప్రయాణించి శ్రీశైలంకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ( CM Chandrababu ) మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, వాటిని ఘాడిలో పెట్టడంతో పాటు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి గల అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా పర్యాటకంగాను, ఆలయాల సందర్శనకు గాను ముందెన్నడూ లేని విధంగా తొలిసారి సీ ప్లేన్‌ను ప్రారంభించడం గర్వంగా ఉందని అన్నారు.
కేంద్ర మంత్రివర్గంలో పిన్నవయస్కుడు రామ్మోహన్నాయుడు తక్కువ సమయంలోనే అత్యుననత స్థానానికి ఎదిగిన వ్యక్తి అని ప్రశంసించారు. సీ ప్లేన్ ప్రయాణం కొంత అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగం ఆర్థికంగా ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపారు.