“విద్య ప్రభుత్వ బాధ్యత కాదు“ అని కూసిన శాడిస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు అని వైసీపీ విమర్శించింది. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పేదవాడికి విద్యను దూరం చేయడమే కాదు.. ప్రభుత్వ పాఠశాలలను ఏనాడూ పట్టించుకోని దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా అంటే అది శాడిస్ట్ చంద్రబాబే అని పేర్కొంది. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు సాధించిన ఘనకార్యాలు ఏంటి శాడిస్ట్ చంద్రబాబు అని ప్రశ్నించింది.
నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మార్చేశారని వైసీపీ తెలిపింది. ఫర్నీచర్ దగ్గరి నుంచి బాత్రూంల వరకు అన్నీ మార్చి అందంగా తీర్చిదిద్దారని పేర్కొంది. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించింది. కనీసం ఆయన చదువుకున్న పాఠశాలను కూడా బాగు చేయలేకపోయారని విమర్శించింది. 2018–19లో ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే గత ఏడాది నాటికి 40 లక్షల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని తెలిపింది. టెన్త్ తరువాత ఇంటర్లో చేరిన విద్యార్థుల సంఖ్య 2018–19లో 47 శాతం ఉంటే, 2022–23లో ఆ సంఖ్య 70 శాతానికి పెరిగిందని చెప్పింది. మరి నీ హయాంలో ఎందుకు చదువుకునే విద్యార్థుల శాతం పెరగలేదని నిలదీసింది. ఏరోజు ప్రభుత్వ బడుల గురించి కానీ.. పేద ప్రజల చదువుల గురించి కానీ ఆలోచించలేదు కాబట్టే చంద్రబాబు టైమ్లో విద్యార్థుల సంఖ్య పెరగలేదని విమర్శించింది. చంద్రబాబు ఆలోచన అంతా ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించడం.. అందులో వచ్చే కమీషన్ నీకింతా..నాకింత అని పంచుకోవడమే అని పేర్కొంది. అందుకే చంద్రబాబు హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొంది.
అయినా టీడీపీ నాయకులను, శాడిస్టు చంద్రబాబును ఎన్ని అన్నా దున్నపోతు మీద వాన కురిసినట్లే..వాళ్లకు చలనం ఉండదని వైసీపీ విమర్శించింది. సిగ్గు..ఎగ్గూ ఎప్పుడో వదిలేశారని పేర్కొంది. మానం..మర్యాదలు వాళ్ల నిఘంటువులోనే ఉండవని ఎద్దేవా చేసింది.