అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా బడ్జెట్ సమావేశాలు (AP assembly ) మార్చి 19 వరకు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nasir) ప్రసంగం అనంతం నిర్వహించిన బీఏసీ (BAC) సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అవసరమైతే మరో రెండు రోజుల పాటు సమావేశాలు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానని వెల్లడించిన వైఎస్ జగన్ (YS Jagan) తొలిరోజు సమావేశానికి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేస్తూ పొడియం వద్దకు దూసుకువచ్చారు. పొడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రతులను చించివేశారు.
సభా ప్రారంభమైన పది నిమిషాలకే వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అనంతరం వైసీపీ నాయకులు సమావేశమై వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుడదని నిర్ణయం తీసుకున్నారు .