అమరావతి : ‘ వై నాట్ 175 ’ లక్ష్యంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ(YCP) పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు(MLAs) , ఎంపీ(MPs)లు ఒక్కొ్క్కరూ రాజీనామా చేస్తూ ఆ పార్టీ లక్ష్యానికి గండి కొడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan) నిర్వహించిన సర్వేలో గెలిచే, ఓడిపోయే అభ్యర్థుల నివేదిక ఆధారంగా ఆయా నియోజకవర్గంలో మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశం దక్కని వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో కొందరు టీడీపీ(TDP) , జనసే(Janasena) లో చేరారు.
అదే కోవలో పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Srikrishna Devarayalu) తాను టీడీపీలో చేరనున్నట్లు నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో వెల్లడించారు. ఐదేళ్లుగా తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనని ఆయన పేర్కొన్నారు. ‘ పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మరోసారి మీ ముందుకొస్తున్నా. ఆశీర్వదించాలని కోరారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి తన వంతు కృషి చేశానని లేఖలో పేర్కొన్నారు.
కాగా మచిలిపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరగా, రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.