అమరావతి : పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణశాఖ (Meteorological Department) మరోసారి హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది .
అల్లూరి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ ఎలెర్ట్ను జారీ చేసింది. తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మత్య్సకారులు వేటకు వేళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నాలుగు రోజుల పాటు వర్షాలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో చాలా చోట్ల, మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన చోడవరం 11 సెం.మీ, గుడివాడలో మచిలిపట్నంలో 7 సెంమీ వర్షపాతం నమోదయ్యింది .