హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు. కలంగుటే బీచ్‌లోని మెరీనాషాక్ దగ్గర 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో యువకులకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది.
హోటల్ సిబ్బంది కర్రలతో దాడి చేయడంతో ఏపీకి చెందిన రవితేజ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్టు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి హోటల్ యజమాని నేపాల్‌కు చెందిన అగ్నెల్ సిల్వేరా, అతని కుమారుడు షుబర్ట్ సిల్వేరియా, సిబ్బంది అనిల్ బిస్తా, సమల్ సునార్లను అరెస్టు చేశారు. రవితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెంకు తరలించారు.