శనివారం 26 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 04, 2020 , 15:25:15

సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభించాలి: సీఎం జగన్‌

సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభించాలి: సీఎం జగన్‌

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో  సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు. పాఠశాలల్లో  నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.   ఈ సందర్భంగా   జగనన్న విద్యాకానుక కిట్‌లను సీఎం పరిశీలించారు.   అభివృద్ధి పనులకు నిధులకు కొరత లేకుండా చూస్తానని సీఎం  హామీ ఇచ్చారు.  

'సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభించాలి. స్కూళ్లు తెరిచేనాటికి నాడు-నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తికావాలి.  అందమైన వాల్‌ పెయింటింగ్స్‌, బొమ్మలు వేయాలి. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలని' సీఎం సూచించారు. సెప్టెంబర్‌ 5న పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామని మంత్రి సురేష్‌ తెలిపారు. మొదటి దశ నాడు-నేడు పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. 


logo