Tirupati laddoos | తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారయ్యే ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా స్పందించారు.
Tirupati Laddu Prasadam row | Andhra Pradesh Congress President and former AP CM Jagan Mohan Reddy’s sister, YS Sharmila writes to Union Home Minister Amit Shah, requesting him to order an immediate CBI investigation. pic.twitter.com/YPnXYn621A
— ANI (@ANI) September 20, 2024
అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూ (Tirumala laddu)లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు(Chandrababu) ఎలా ఈజీగా తీసుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుందన్నారు. ఇది చిన్న సమస్య కాదని, దీనిపై సీబీఐ విచారణ (CBI investigation) జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)కు షర్మిల లేఖ రాశారు.
#WATCH | Vijayawada: On Tirupati Laddu Prasadam row, Andhra Pradesh Congress President and former AP CM Jagan Mohan Reddy’s sister, YS Sharmila says, “Yesterday, Andhra Pradesh CM N Chandrababu Naidu told that the earlier govt was involved in the adulteration of prasadam. This… pic.twitter.com/vIk68wSVEV
— ANI (@ANI) September 20, 2024
Also Read..
Tirupati laddoos | తిరుమల లడ్డూ కల్తీపై నివేదిక ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ
Tirumala Laddu | తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర మంత్రుల స్పందన.. బాధ్యులను శిక్షించాల్సిందేనంటూ వెల్లడి